Breaking News

బెంగాల్‌ అసెంబ్లీలో రగడ 

Published on Thu, 09/04/2025 - 16:37

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ రణరంగాన్ని తలపించింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్, విపక్ష బీజేపీ సభ్యుల మధ్య గురువారం తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్‌ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ దాడులను ఖండిస్తూ తీర్మానం ఆమోదించాలని పట్టుబట్టారు. తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. 

బీజేపీ తీరుపై విరచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బెంగాల్‌ ప్రజలపై కక్షగట్టారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బెంగాలీతోపాటు ఇతర భాషలను వారు వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ అవినీతి పార్టీ, దొంగల పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. ఓట్ల దొంగతనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలపై సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉసిగొల్పిందని అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని నామరూపాల్లేకుండా చేయాలని వ్యాఖ్యానించారు.

 మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వారిని హెచ్చరిస్తూ మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సభలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉండని రోజు వస్తుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని తేల్చిచెప్పారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి కూలదోస్తారని అన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై జరుగుతున్న అరాచకాలపై అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ సభ్యులకు భయమెందుకని ప్రశ్నించారు. దాంతో సభలో అలజడి మొదలైంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకున్నారు. ఓట్ల దొంగ బీజేపీ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్, ఉద్యోగాల దొంగ తృణమూల్‌ కాంగ్రెస్‌ అంటూ బీజేపీ సభ్యులు నినదించారు. నీళ్ల సీసాలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సభలో సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి.  

బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌  
సభలో పరిస్థితి అదుపు తప్పడంతో బీజేపీ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ శంకర్‌ ఘోష్‌ను సభ నుంచి రోజంతా సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ బీమన్‌ బెనర్జీ ప్రకటించారు. మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. తమ పార్టీ చీఫ్‌ విప్‌ సస్పెన్షన్‌ పట్ల బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జైశ్రీరామ్‌ అని నినదిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. 

బయటకు వెళ్లేందుకు నిరాకరించిన శంకర్‌ ఘోష్‌ను మార్షల్స్‌ బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. బీజేపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, బెంగాలీ వలస కార్మికుల హక్కులు, భద్రతపై జరుగుతున్న కీలకమైన చర్చను అడ్డుకొనేందుకు ప్రయతి్నస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. 

సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మిహీర్‌ గోస్వామి, బంకీం ఘోష్, అశోక్‌ దిండాను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, విపక్ష సభ్యుల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ మందలించారు. పద్ధతి మార్చుకోకపోతే మమ్మిల్ని కూడా సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు గూండాల మాదిరిగా వ్యవహరించారని తప్పుపట్టారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)