Breaking News

రాహుల్‌ భద్రతపై అమిత్‌షాకు ఖర్గే లేఖ

Published on Wed, 01/24/2024 - 09:59

అస్సాం ప్రభుత్వం వర్సెస్‌ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్య జరుగుతున్న తాజా వివాదం నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. గువాహటిలో రాష్ట్ర పోలీసులతో కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాహుల్‌ ఎదుర్కొన్న భద్రత వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.  రాహుల్‌ గాంధీతోపాటు భారత్‌ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న ఇతరులకు  భద్రతా విషయంపై అమిత్‌ షా జోక్యం చేసుకోవాలనికోరారు. 

అస్సాంలో మంగళవారం చోటు చేసుకున్న పలు ఉద్రిక్తతల నేపథ్యంలో  రాహుల్‌ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం జరిగింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు  రాహుల్ , కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని కేంద్ర హోంమత్రికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు. కాంగ్రెస్ పోస్టర్లను ధ్వంసం చేయడం, కాంగ్రెస్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడి చేయడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు.
చదవండి: తగ్గేదేలే.. రాహుల్‌ గాంధీపై కేసు నమోదు

వీటన్నింటి విషయాల్లో అస్సాం పోలీసులు బీజేపీ కార్యకర్తలవైపు పక్షాన నిలిచారని ఆరోపించారు. అంతేగాక కాషాయ శ్రేణులకు రాహుల్‌ కాన్వాయ్‌ దగ్గరకు రావడానికి అనుమతించారని విమర్శించారు. రాహుల్‌, ఆయన సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పటికీ.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వారెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు.

న్యాయ యాత్ర కొనసాగుతున్న కొద్దీ రాహుల్‌కు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, ఇకనైన అమిత్‌షా జోక్యం చేసుకొని రాహుల్‌ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత కల్పించేలా అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ఆదేశించాలని కోరారు.

ఇదిలా ఉండగా భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అస్సాం పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది.

చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)