Breaking News

భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..

Published on Thu, 10/09/2025 - 08:23

ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.

కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్‌ కాంబర్‌ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.

పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్‌ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్‌ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్‌ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం..  వరకట్న వేధింపుల ఘటనలు,  ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్‌ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. 

ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్‌ సూసైడ్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)