Breaking News

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి.. కేరళ మహిళకు తీవ్ర గాయాలు

Published on Mon, 10/09/2023 - 13:43

తిరువనంతపురం: ఇజ్రాయెల్‌-హమాస్ దళాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరువైపుల నుంచి దాదాపు 1000 మందికి పైగా మరణించారు. ఇందులో ఇజ్రాయెల్‌లో ఉన్న విదేశీయులు కూడా ఉన్నారు. కేరళకు చెందిన ఓ భారతీయురాలు కూడా హమాస్ దాడుల్లో తీవ్రంగా గాయపడింది.

కేరళకు చెందిన షీజా ఆనంద్‌(41) ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఆమె క్షేమంగానే ఉన్నట్లు ఇక్కడి కుటుంబ సభ్యులతో చెప్పారు. హమాస్ దాడుల క్రమంలో షీజా భర్త ఫోన్ చేయగా.. అకస్మాత్తుగా కాల్ కట్ అయిపోయింది. ఆ సమయంలో భారీ శబ్దం వినిపించింది.

మరుసటి రోజు ఓ భారతీయుడు షీజా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె గాయపడినట్లు చెప్పాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించాడు. షీజా యోగక్షేమాలను కనుగొనడం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)