Breaking News

‘రాహుల్‌ కంటే మోదీ పాపులర్‌’ వ్యాఖ్యలు.. చిక్కుల్లో కార్తీ చిదంబరం

Published on Tue, 01/09/2024 - 21:23

చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.  

కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్‌ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు

అదే విధంగా  కాంగ్రెస్‌ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ ఇటీవల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. 

అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి.
చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు