ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు

Published on Mon, 02/16/2026 - 17:18

కర్ణాటకాలో గతేడాది ఇజ్రాయెల్ మహిళతో పాటు మరోకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఘటనలో అరెస్టైన ముగ్గురిని నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణశిక్ష విధించింది. 

2025 మార్చి 6న ఒక మహిళా ఇజ్రెయెల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్‌కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమకాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.

అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు. 

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం..  ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)