అక్కడా మన వైద్యులే!

Published on Sat, 11/08/2025 - 04:34

అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్‌ తన హవాను కొనసాగిస్తోంది.

ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ అవుట్‌లుక్‌–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్‌ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. 

మనమే టాప్‌
ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు.  వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవ­లు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్‌–3లో ని­లి^­éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్‌ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యు­లు, నర్సులలో ఒకరు యూరోపియన్‌ ఎకనామిక్‌ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.

ఆ నాలుగు దేశాలే
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ 3.90 లక్షలు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రధాన దేశంగా..
చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్‌ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది  దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.

నలుగురిలో ఒకరు బ్రిటన్‌కు
2023లో భారత్‌ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్‌ స్టేట్స్‌కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.

75వేల డాక్టర్లు మనవాళ్లే
2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం.  అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్‌లో ఉన్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)