Breaking News

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Thu, 05/08/2025 - 16:55

ఢిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పలు విషయాలను పంచుకున్నారు. తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు.  భారత్‌ చేసిన మెరుపుదాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదలు మరణించారని ఆయన తెలిపారు. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా పూర్తి కాలేదని.. కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌ తీరు మార్చుకోకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

POK ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇండియన్‌ ఆర్మీ పూర్తిగా ధ్వంసం చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైన్యంపై రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందనలు తెలిపారు. భారత్‌ చేసిన దాడిలో పాక్‌ పౌరలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్‌ చేశామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఔట్‌సోర్సింగ్‌ చేస్తోందని ఆయన విమర్శించారు.

భారత్‌ వద్ద నైపుణ్యం పొందిన సైన్యంతో పాటు బలమైన ఆయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సైనికులు చూపిన సాహసాలకు దేశం గర్విస్తుందన్నారు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రధాని మోదీ పదేళ్ల క్రితం చెప్పారని గుర్తుచేశారు. రక్షణ పరికరాల కోసం తీవ్రంగా శ్రమించామన్నారు. నేడు భారత్‌ ఉత్పత్తి చేస్తున్న రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయన్నారు. భారత రక్షణ రంగంలో క్వాలిటీ, క్వాంటిటీని పెంచుతూ వచ్చామన్నారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)