Breaking News

ట్రంప్‌-పుతిన్‌ల భేటీపై భారత్‌ స్పందన

Published on Sat, 08/16/2025 - 18:00

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్‌ను భారత్‌ స్వాగతించింది.  ఇరు దేశాల అధ్యక్షుల మధ్య  సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్‌ అభినందించింది. 

 రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్‌ ఉపయోగపడుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.  ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఆశాభావం ‍వ్యక్తం చేశారు.

‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్‌ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్‌  దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్‌ చివరలో ట్విస్ట్‌ ఇచ్చారు.

కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.

మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తానని ట్రంప్‌ తెలిపారు. కానీ  ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్‌-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)