Breaking News

ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్‌’తో కదం తొక్కిన అన్నదాతలు!

Published on Tue, 07/21/2026 - 09:21

న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కిసాన్ ఘాట్‌లో ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో జరిగే ‘మహా పంచాయత్’లో వీరంతా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ ఒప్పందం వల్ల భారత రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్‌సీ) నేత జర్మన్‌జిత్ సింగ్ బండాల ఆరోపించారు. అమెరికాలో భారీ సబ్సిడీలతో వేలాది ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోందని, కానీ మన దేశంలో మెజారిటీ రైతులకు కేవలం 2 నుంచి 2.5 ఎకరాల భూమి మాత్రమే ఉందనని ఆయన గుర్తుచేశారు. ఈ ఒప్పందంతో చౌకైన అమెరికా వ్యవసాయ దిగుమతులు దేశీయ మార్కెట్లోకి వస్తే, చిన్న రైతులు పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు.
 

అమెరికా ఒత్తిడికే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈ ఒప్పందాన్ని ముందుకు తెస్తోందని ఆయన విమర్శించారు. కేవలం వ్యవసాయమే కాకుండా, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాల్లోని ఉద్యోగాలపై కూడా ఈ ప్రభావం పడుతుందన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయ వేదికపై పాక్‌ పరువు పాయే!
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)