Breaking News

‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్‌ పౌరులకు కేంద్రం హెచ్చరిక

Published on Wed, 04/23/2025 - 21:23

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి. పాక్‌ పౌరులను భారత్‌లోకి అనుమంతించేది లేదు. పహల్గాం దాడి వెనుక పాక్‌ హస్తం ఉంది. అందుకు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి  విక్రమ్‌ మిస్రీ స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో రెండున్నర గంటల పాటు భద్రత వ్యవహారాల కేబినేట్‌ కమిటీ (Cabinet Committee on Security) సమావేశం కొనసాగింది. అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. 

👉ఇండస్ వాటర్‌ ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత
1960లో కుదిరిన ఇండస్ వాటర్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భద్రత వ్యవహారాల కేబినేట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేత కొనసాగుతుంది. 

👉అటారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు తక్షణమే మూసివేత
అటారి చెక్‌పోస్టును తక్షణమే మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చట్టబద్ధమైన డాక్యుమెంట్లతో ఆ మార్గం గుండా భారత్‌కు వచ్చిన పాకిస్తానీయులు మే 1వ,2025  తేదీ లోపు తిరిగి వెళ్లాల్సిందేనని ఆదేశించింది.  

👉పాక్‌ పౌరులకు SAARC వీసా మినహాయింపు నిలిపివేత
SAARC Visa Exemption Scheme (SVES) ద్వారా పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ వీసాతో భారత్‌లో ఉన్న వారు 48 గంటల్లో దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది.

👉 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సైనిక సలహాదారులకు 'పర్సోనా నాన్ గ్రాటా'విధింపు 
భారత్‌లో ఉన్న పాక్‌ రక్షణ, నౌకా, వాయుసేన సలహాదారులపై ''persona non grata' విధించింది. ఒక వారంలోగా వారందరూ భారత్ విడిచిపెట్టాలి.

👉  ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ నుంచి సైనిక సలహాదారుల ఉపసంహరణ
పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌ పాక్‌లోని ఇస్లామాబాద్ హైకమిషన్ నుండి భారత రక్షణ, నౌకా,వాయుసేన సలహాదారులను ఉపసంహరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)