మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ

Published on Fri, 05/30/2025 - 12:20

పాట్నా: పహల్గాం నిందితుల్ని మట్టిలో కలిపేస్తానని ఆరోజు మాట ఇచ్చా.. ఇచ్చిన మాట ప్రకారం ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదాల్ని హతమార్చాం’ అని ప్రధాని మోదీ అన్నారు. 

శుక్రవారం ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి బీహార్‌లో పర్యటించిన సమయంలో మీకు హామీ ఇచ్చా. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది. వాళ్ల వెనకున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని. మీకు మాట ఇచ్చినట్లుగా ఆపరేషన్ సిందూర్‌తో పహల్గాం ఉగ్రవాదుల్ని  మట్టిలో కలిపాం. ఆ నాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని బీహార్ గడ్డపై అడుగుపెట్టా.  


ఆపరేషన్ సిందూర్‌లో మన దళాలు నిమిషాల వ్యవధిలో మెరుపు వేగంతో వారిని అణిచేశాయి. పాక్ ఉగ్రస్థావరాల్ని నేలమట్టం చేయడమే కాదు,   నిమిషాల వ్యవధిలోనే పాక్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాయి. పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలు ఆపరేషన్ సిందూర్ పవర్‌ని చూశాయి. ఉగ్రవాదంపై మా పోరు ఆగదు. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల చరిత్ర ముగిసిపోతుంది. చాలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడ్డాయి. ఇది నయా భారత్‌. ఇదే భారత్‌కు కొత్త బలం అని పునరుద్ఘాటించారు.

ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేస్తాం.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీహార్‌లో ప్రధాని మోదీ 
‘‘మిత్రులారా.. బిహార్‌ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారిని మట్టిలో కలిపేస్తాం. వాళ్లు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం.

శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ  అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)