Breaking News

సంబంధాల బలోపేతానికి భారత్‌–కెనడా రోడ్‌మ్యాప్‌ ఖరారు

Published on Tue, 10/14/2025 - 05:29

న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్‌ మ్యాప్‌ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్‌కు రావడం తెల్సిందే. 

రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్‌ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 

‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్‌మ్యాప్‌పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్‌తో చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)