Breaking News

మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!

Published on Wed, 06/17/2026 - 14:53

 

NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె  23 ఏళ్ల  రియా కుమారి థాపా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.  

ఇంటర్‌లో 97 శాతం, విషాదం
జూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్ష (re-examination) కోసం రియా సిద్ధపడుతోంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం రాసే NEET-UG పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది.   అయితే ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో అనే ఒత్తిడి మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.  తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ ఒక సూసైడ్ నోట్  కూడా రాసింది. అందులో హిందీలో "ఐ లవ్ యూ, మమ్మీ, పాపా. ఇందులో ఎవరి తప్పూ లేదు" అని  పేర్కొనడంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరి తరమూ కావడంలేదు.  రియా గతంలో 12వ తరగతిలో 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలవడం గమనార్హం. 

ఇదీ చదవండి: షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!
 

రాత్రంతా చదువుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం రియాకు అలవాటు. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి తల్లి ఆమె గది తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో, తండ్రి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా రియా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే, చదువుల్లో ఆశించిన విజయం సాధించలేకపోతున్నాననే తీవ్ర నిరాశ, తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక కారణాలని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ కండారీ తెలిపారు.

ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ వార్నింగ్‌

నోట్‌ : చదువుల ఒత్తిడి, పరీక్షల భయం వల్ల ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు నిపుణుల లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. 

 ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)