Breaking News

ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్‌ భావోద్వేగ సందేశం

Published on Thu, 07/16/2026 - 12:20

సాక్షి, న్యూఢిల్లీ:  నీట్‌ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాలాంటి డిమాండ్లతో  నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల ప్రాణం చాలా విలువైనది. వారి ప్రాణాలు కాపాడటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను రక్షించడానికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. ఆయన ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ వైద్యులను నియమించాలని  కేంద్రాన్ని ఆదేశించింది.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 'కాక్రోచ్‌ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్‌ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర  ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు, కీలక ఆదేశాలను జారీ చేసింది.

ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్‌, మరో ఇద్దరు భారతీయ నిపుణులు

ఇప్పటిదాకా ప్రైవేట్ వైద్యులు వాంగ్‌చుక్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై ప్రతిరోజూ కేవలం ప్రభుత్వ వైద్యుల చేతే క్రమబద్ధమైన తనిఖీలు చేయించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. పౌరుల ప్రాణాలు చాలావిలువైనవి, వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టండి అని కేంద్రానికి హైకోర్టు  ఆదేశించింది. రానున్న 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని బుధవారం దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు ఈ విచారణ చేపట్టింది.

సోనమ్‌ భావోద్వేగ వీడియో
మరోవైపు కోర్టు ఉత్తర్వులకు కొన్ని గంటల ముందు సోనమ్ వాంగ్‌చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ,దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.  తాను నీరస పడినప్పటికీ, గుండె, ఇతర అంతర్గత అవయవాలు ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు నడవ గలను అన్నారు. ఈ సందర్భంగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసనలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యను ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా  NEET-UG వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా ఆయనను తొలగించాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి  పరిహారం చెల్లించాలనే డిమాండ్స్‌తో అభిజీత్ నేతృత్వంలోని సీజేపీ ఆందోళనకు దిగింది. ఈ ఉద్యమానికి మద్దతుగానే సోనమ్ వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)