Breaking News

హేమంత్‌ సొరెన్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరణ

Published on Wed, 05/22/2024 - 13:36

ఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరెన్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్‌ను ​ఆరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 

రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. 

దీంతో  మాజీ సీఎం సొరెన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో​ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్‌ మొత్తం 14  లోక్‌సభ సీట్లలో  ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్‌ 1)న పోలింగ్‌ జరగనుంది. 

ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్‌ కోరుతూ సొరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్‌ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)