Breaking News

కేరళకు భారీ వర్ష సూచన.. అయ్యప్ప భక్తులకు అలర్ట్‌

Published on Sat, 11/15/2025 - 15:15

తిరువనంతపురం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది(IMD). శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల పూజల కోసం తెరుచుకోనున్నాయి. వేలాది మంది భక్తులు పంబా, నిలక్కల్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తోంది. 

రాబోయే మూడు రోజులు నవంబర్ 16 నుంచి 18 దాకా కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండీ పేర్కొంది.  ఇడుక్కి, కొట్టాయం, పత్తనం‌తిట్ట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 

దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

అధికారుల సూచనలు:

  • భక్తులు రెయిన్‌కోట్, టార్చ్‌లైట్, మెడికల్ కిట్ వంటి అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోవాలి

  • వర్షాల కారణంగా మార్గాల్లో మట్టి జారే ప్రమాదం ఉండవచ్చు.. అప్రమత్తంగా ఉండాలి

  • పంబా, ఎరుగుమలై, నిలక్కల్ ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి

అంతేకాదు.. కల్లకడల(Kallakkadal) కారణంగా(సముద్రంలో అలజడి) ఆలప్పుఝా, ఎర్నాలకుం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్‌, కన్నూర్ తీరప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగసిపడే నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. 
 
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల-మకరవిళక్క యాత్రా కాలానికిగానూ తలుపులు తెరుచుకోనుంది. ఈ పవిత్ర యాత్రా కాలం జనవరి 20 వరకు కొనసాగనుంది. అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టింది. దేశంలో వరుసగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్న క్రమంలో.. భక్తుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. రోజుకు 90,000 భక్తులకు రోజువారీ పరిమితి విధించారు. నిలక్కల్, పంబా ప్రాంతాల్లో తాత్కాలిక గుడిసెలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)