Breaking News

జిమ్‌ ట్రైనర్‌తో లవ్‌.. భర్తపై హత్యాయత్నం : కట్‌ చేస్తే..!

Published on Wed, 10/28/2026 - 13:03

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో ఒక భర్త అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు (జిమ్ ట్రైనర్) పన్నాగం బయటపడడంతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.  జిమ్ ట్రైనర్‌తో ఉన్న సంబంధం గురించి భర్తకు తెలియడంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిగ్భ్రాంతి కరమైన ఈ స్టోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వసుంధర సెక్టార్ 1లోని జగృతి RWA సొసైటీలో శశాంక్ కంతారియాను హత్య చేయాలని  శశాంక్ భార్య ప్రియా శర్మ,  ఆమె ప్రియుడు ప్రతాప్ సింగ్ (ఫిట్‌నెస్ హెడ్‌క్వార్టర్స్ జిమ్ ట్రైనర్)తో  కలిసి ప్లాన్‌ వేసింది. అక్టోబర్ 26న తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో అతనిపై దాడిచేశారు. కత్తితో పలుమార్లు పొడిచారు. అయితే తీవ్రంగా గాయపడిన శశాంక్ కేకలు వేయడంతో, నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను ఆసుపత్రికి తరలించారు. 

శశాంక్ సోదరుడి ఫిర్యాదు మేరకు ఇందిరాపురం పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో  ఎవరి పాత్ర ఎంత  అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగ పందెంలో కవితకు ఓటమి

దాడికి కుట్ర ఇలా..
పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం గత 7-8 నెలలుగా జిమ్‌కు వెళ్తున్న ప్రియా శర్మకు, ట్రైనర్ ప్రతాప్ సింగ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, వీరి సంబంధం గురించి భర్త శశాంక్‌కు తెలియడంతో ఆయన దీపావళి తర్వాత వేరే ఫ్లాట్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని భావించారు.  ఈక్రమంలోనే అక్టోబర్ 25న ఉదయం వాకింగ్ సమయంలో కలసిన ప్రియా, ప్రతాప్‌లు శశాంక్‌ను అంతమొందించాలని పథకం వేశారు. పథకంలో భాగంగా అక్టోబర్ 26 ఉదయం ప్రియా ఇంటి తలుపులు తెరిచి ఉంచగా, ప్రతాప్ లోపలికి ప్రవేశించి శశాంక్‌పై కత్తితో తీవ్రంగా దాడి చేశాడు.

ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)