Breaking News

తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి..

Published on Thu, 08/24/2023 - 12:03

బీహార్‌లోని భాగల్పూర్‌లో ఒక తండ్రి తన మైనర్‌ కుమార్తెను వయసుమీరిన వ్యక్తికి ఇచ్చి, వివాహం చేసిన ఉదంతం సంచలనంగా మారింది. ఆ బాలికకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టంలేకపోయినప్పటికీ, తండ్రి బలవంతంగా ఈ వివాహాన్ని జరిపించాడు. వివాహం అనంతరం బాధిత బాలిక ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌చేస్తూ, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. ఆ 16 ఏళ్ల బాలిక తాను చదువుకోవాలనుకుంటున్నానని, తనకు న్యాయం చేయని పక్షంలో ప్రాణాలు తీసుకుంటానని పేర్కొంది. 

బాలిక పుట్టింటివారు జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఉంటారు. ఈ వీడియోలో ఆ బాలిక తన తల్లి గత ఏడాది అంటే 2022 డిసెంబరులో మృతి చెందిందని తెలిపింది. తన తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. తన తండ్రిపై అప్పుల భారం ఉందని తెలిపింది. తన తండ్రికి రుణం ఇచ్చిన ఒక వ్యక్తి.. ఈ రుణం తీర్చేందుకు బదులుగా కుమార్తె(తన)తో వివాహం చేయించాలని కోరాడని తెలిపింది. దీనికి తన సవతి తల్లి వంతపాడిందని, తనకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేదని పేర్కొంది. అయితే గత జూలైలో బలవంతంగా ఆ వ్యక్తితో తనకు వివాహం జరిపించారని ఆమె పేర్కొంది. 

పెళ్లి అయ్యాక తాను భాగల్‌పూర్‌ చేరుకున్నానని, తన భర్త తనను నిత్యం కొడుతుంటాడని, నిందిస్తుంటాడని బాధితురాలు తెలిపింది. తుపాకీ చూపించి, తనతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని, ఈ వేధింపులను తాను భరించలేకపోతున్నానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. 

కాగా ఆ బాలిక తన భర్త, తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోగా, వారు ఎటువంటి సహాయం చేయకపోగా, ఇది తమ పరిధిలోని కేసు కాదని ఆమెను పంపించివేశారు. దీంతో బాధితురాలు డీఐజీ కార్యాలయానికి చేరుకుని, అక్కడి సిబ్బందికి తన ఆవేదన తెలియజేసినా వారు పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా విసిగిపోయిన ఆమె తన బాధను వ్యక్తం  చేస్తూ ఒక వీడియో రూపొందించి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ అయిన నేపధ్యంలో భాగల్‌పూర్‌ ఎస్పీ ఆనంద్‌ కుమార్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు.  
ఇది కూడా చదవండి: అది రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట! 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)