Breaking News

అమ్మ కూలి, నాలీ చేస్తే.. కొడుకు ఐఎఫ్‌ఎస్ అధికారయ్యాడు!

Published on Wed, 09/23/2026 - 19:38

ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. అందుకే అష్టకష్టాలకోర్చి మరీ పిల్లల్ని చదివించింది. ఆర్థిక కష్టాలు, ఆకలి, నిద్రలేని రాత్రులు, ప్రమాదాలు  అనారోగ్యం, ఇలా విధి ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ తల్లి ఎక్కడా  తలొగ్గలేదు. పిల్లల చదువును కొనసాగించేందుకు ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  అందుకే తన ఉన్నతికి పాటుపడిన ఆ  తల్లి త్యాగాలను  ఆ కొడుకు స్మరించుకున్నారు.  తన తల్లి ఏళ్ల తరబడి చేసిన త్యాగాలకు దక్కిన తొలి ప్రతిఫలం ఈ కుర్చీ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

కూలీగా, చెత్త ఏరుకునే  మనిషిగా పనిచేస్తూ తన కుమారుడిని ఐఐటీ (IIT) చదివించి, ఐఎఫ్‌ఎస్ (IFS) అధికారినే చేసిన ఒక తల్లి విజయగాథ  నెట్టింట  వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన సాఖుబాయి పదిభార్ చదువుకోకపోయినా  చదువు  అంటే ప్రాణం. కుటుంబ పోషణ కోసం గ్రామంలో రోజువారీ కూలీగా, ఆ తర్వాత ముంబైలోని మురికివాడల్లో చెత్త ఏరుకునే వ్యక్తిగా (Ragpicker) పనిచేశారు.ఇన్నీ కష్టాల మధ్య కొడుకును ఉన్నత  చదువు  చదించారు. ఆమె చేసిన త్యాగాలు,ఆమె కుమారుడు  ఐఐటి మద్రాస్‌లో చదువుకుని, ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరిన ఆమె కుమారుడు గౌతమ్ పడిభర్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించాయి.

 

ఇదీ చదవండి: పక్కింటి వైఫై సాయం : స్లమ్‌ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్‌

సాఖుబాయి కుమారుడు గౌతమ్ పదిభార్ మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు. ఎలాంటి అధికారిక కోచింగ్ లేకుండానే జేఈఈ (JEE) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ తర్వాత యూపీఎస్సీ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్ష-2022లో ఆల్ ఇండియా ర్యాంక్ 139 సాధించారు. 2023 ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఎంపికయ్యారు.  ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి: 23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్‌ వదిలి ‘అమ్మ’దగ్గరికి

భావోద్వేగ క్షణం
గౌతమ్ ఇటీవల తన తల్లికి సంబంధించిన ఒక భావోద్వేగ క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇటీవల తన తల్లి సాఖుబాయిని తన ఆఫీస్‌కు ఆహ్వానించిన గౌతమ్, ఆమెను తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టారు. "నా జీవితంలో నేను సాధించిన ప్రతిదానికీ నా అమ్మే కారణం. పోరాట పటిష్టతను, కష్టపడే తత్త్వాన్ని, పెద్ద కలలు కనే స్వేచ్ఛను నాకిచ్చింది  అమ్మే" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు  చేసుకొని  గౌతమ్  ఎమోషనల్‌ అయ్యారు.

ఇదీ చదవండి: లండన్‌ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
 

 

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)