Breaking News

దేశంలో దీపావళి ప్రమాదాలు.. ముగ్గురు మృతి

Published on Mon, 11/09/2026 - 07:56

న్యూఢిల్లీ: దీపావళి సంబరాల వేళ దేశవ్యాప్తంగా పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాల్చడం కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. ఒకచోట గార్మెంట్ ఫ్యాక్టరీలు, మరోచోట ప్లాస్టిక్ పరిశ్రమలు, దుకాణాలు, ఇళ్లు, గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. దీపావళి వేడుకల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతిచెందారు. ఢిల్లీలోని నరేలాలో రాకెట్ టపాసు తగిలి పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
 

ఢిల్లీలో గార్మెంట్ ఫ్యాక్టరీలో..
ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతం నాంగ్లీ సక్రావతిలో గల గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో 25 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశాయి. నరేలాలోని మరో ఫ్యాక్టరీలోనూ అగ్నిప్రమాదం జరగ్గా ఆరు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పాయి. షాహదరాలోని అశోక్ నగర్‌లో రమేశ్ స్టోర్ వద్ద కొందరు యువకులు టపాసులు కాల్చడంతో మంటలు దుకాణానికి వ్యాపించి సరుకు మొత్తం దగ్ధమైంది.
 

ఘజియాబాద్‌లో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు
ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్‌లో ఓ ఫ్లాట్‌లోకి రాకెట్ రావడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. మూడు ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. విజయ్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని నోవా ఫార్మ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలోనూ భారీగా మంటలు చెలరేగాయి. లోపల ప్లాస్టిక్ షట్టరింగ్ సామగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, నల్లటి పొగ కమ్ముకుంది. లక్నోలోని చోటా దేవీ ఖేడాలో ఉన్న ఓ పాత సామాన్ల గోదాములోనూ అగ్నిప్రమాదం జరిగింది.

నవీ ముంబై నుంచి పుణె వరకు..
మహారాష్ట్రలోని నవీ ముంబై తుర్భే సెక్టార్‌-21 షాపింగ్ సెంటర్ మొదటి అంతస్తులోని సోఫాల తయారీ దుకాణంలో మంటలు చెలరేగాయి. ముంబై విద్యావిహార్‌లోని స్కైలైన్ ఎపిటోమ్ భవనంలోనూ అగ్నిప్రమాదం సంభవించింది. హాజీ కసమ్ చాల్‌లోని గ్యారేజీలో మంటలు వ్యాపించడంతో అందులోని సామగ్రి మొత్తం కాలిపోయింది. పుణెలోని వడ్గావ్ షేరి అపార్ట్‌మెంట్‌తో పాటు ఫుర్సుంగిలోని ఓ గోదాములోనూ అగ్నిప్రమాదాలు జరిగాయి. ఠాణేలోని రహేజా గార్డెన్ నివాస సముదాయంలోని 8, 9, 10వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మధ్యప్రదేశ్‌లోనూ..
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జనతా బ్యాంక్ క్రాసింగ్ సమీపంలో ఓ రెస్టారెంట్, ఇంట్లో మంటలు చెలరేగాయి. 10 నుంచి 12 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. దేవాస్‌లో దీపావళి రాత్రివేళ మూడు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరిగిన అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. 

ఇదీ చదవండి: దీపావళి ఎఫెక్ట్: విషవాయువుల కోరల్లో ఢిల్లీ

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)