Breaking News

నీట్ పేప‌ర్ లీక్‌.. బిహార్‌, మ‌హారాష్ట్ర‌.. బ‌య‌ట‌ప‌డిన‌ ఢిల్లీ క‌నెక్ష‌న్‌

Published on Mon, 06/24/2024 - 12:34

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు మహారాష్ట్ర స్కూల్ టీచర్లపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్ద‌రు టీచ‌ర్ల‌ను సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌లుగా యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌) గుర్తించింది.

వీరు జిల్లా ప‌రిషత్ పాఠ‌శాల‌ల్లో టీచింగ్‌ చేసేవార‌ని, లాతూర్‌లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లను కూడా నడుపుతున్న‌ట్లు తేలింది. అనేక గంట‌లు విచారణ అనంతరం జలీల్ ఉమర్‌ఖాన్ పఠాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, సంజయ్ తుకారాం జాదవ్ పరారీలో ఉన్నారు.

వీరి ఫోన్లలో పలువురు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, వాట్సాప్ చాట్‌లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తితో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన గంగాధర్... విద్యార్ధులు సంజయ్ తుకారాం జాదవ్‌, జ‌లీల్ ఉమర్ఖాన్ పఠాన్‌లను సంప్రదించడానికి సహాయం చేసిన‌ట్లు తేలింది.

మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో గంగాధర్‌, నాందేడ్‌లోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఈరన్న కొంగళ్వార్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలపై వీరిపై కేసు నమోదు చేశారు.

విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర‌ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. డార్క్ నెట్‌లో పేపర్లు లీక్ కావడం, విక్రయించడం వంటి అక్రమాలపై కూడా ఇది విచారణ చేస్తోంది.

అదే విధంగా పోటీ పరీక్షలలో అవకతవకలు, పేప‌ర్ లీక్‌ల‌ను  అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా అమలు చేసింది. నేరస్తులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించడం వంటి క‌ఠిన చ‌ర్య‌లు విధిస్తుంది. కాగా నీట్ యూజీ పరీక్షకు ఒక రాత్రి ముందు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు అంగీకరించిన నలుగురిని బీహార్ పోలీసులు ఇటీవ‌ల అరెస్టు చేసి విచారిస్తున్నారు.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)