Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌ పార్ట్‌-2.. పార్ట్‌-3 కూడా ఉంటది!

Published on Mon, 09/22/2025 - 11:20

ఆపరేషన్‌ సిందూర్ అనేది ఒక సైనిక చర్య కాదని.. అది మన దేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పశక్తికి ప్రతీక అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అలాగని ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిపోలేదని.. కేవలం తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టత ఇచ్చారు. ఆఫ్రికా దేశం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. 

‘‘ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశాం. ఆపరేషన్‌ సిందూర్‌ పార్ట్‌-2, 3 ఉంటుందా? అనేది పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. తగిన విధంగా బదులిస్తాం. ఇందుకోసం భారత సైన్యం సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే రంగంలోకి దిగుతుంది’’ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో.. 

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశంపైనా ఆయన స్పందించారు. పీవోకేపై దాడి అవసరం లేదని.. అది స్వయంగా భారత్‌లో కలిసిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2025 ఏప్రిల్ 22న.. జమ్ము కశ్మీర్‌ బైసరన్‌ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ప్రకటించుకుంది(తర్వాత తాము కాదంటూ ఫ్లేట్‌ ఫిరాయించింది కూడా). ఈలోపు.. 

మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట మెరుపు దాడులతో భారత సైన్యం పాక్‌లోకి దూసుకెళ్లి.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే.. పాక్‌ బతిమాలి కాల్పుల విరమణకు అంగీకరించడంతో భారత్‌ ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. 

జూలై 28వ తేదీన శ్రీనగర్‌ దాచిగాం ప్రాంతంలో భారత సైన్యం, జమ్ము పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గాం సూత్రధారులు సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ(పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారి), టీఆర్‌ఎఫ్‌ సభ్యులు హమ్జా అఫ్గానీ, జిబ్రాన్ మరణించారు.

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)