Breaking News

కర్నల్‌ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు

Published on Wed, 05/14/2025 - 19:30

భోపాల్‌: ఆపరేషన్‌ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్‌లో పాల్గొన్న కల్నల్‌  సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్‌  సల్మాన్‌ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్‌ షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది.

కర్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలు 
మంత్రి విజయ్‌ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.

అయితే, విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్‌పూర్‌ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్‌ సల్మాన్‌ ఖురేషీపై విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించింది

ఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.

 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు