పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!
Breaking News
Comment X: పబ్లిక్ రోడ్లు కాస్త..
Published on Thu, 05/29/2025 - 11:08
నడిరోడ్డులో.. పగలురాత్రి తేడాల్లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలెన్నో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కారణంగా అవి వైరలూ అవుతున్నాయి. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్‌లో ఓ నేత రోడ్డు మీదే ఓ మహిళతో నగ్నంగా శృంగారం జరిపి కటకటాల పాలయ్యాడు. తాజాగా కర్ణాటకలో కదిలే కారులో రెచ్చిపోయింది ఓ జంట.
బెంగళూరుకు చెందిన ఓ జంట మే 27వ తేదీన కోరమంగళలో డిన్నర్ చేసింది. ఆపై కారులో వెళ్తూ.. సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయసాగింది. దారినపోయే వాహనదారులు ఆ తతంగం అంతా రికార్డు చేశారు. అయితే.. Karnataka Portfolio అనే ఎక్స్ పేజీ ఆ వీడియోను హైలైట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి జుగుప్సాకరమైన చేష్టలు ప్రజలకు ఇబ్బందికరమైనవని, కారులో ఉన్నవాళ్లతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ఇబ్బందుల్లోకి నెడతాయని పేర్కొంది.
వీడియో బాగా వైరల్ కావడంతో నగర పోలీసులు స్పందించారు. వీడియోలో నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసి ఓనర్‌ను పట్టుకున్నారు. ప్రమాదకరీతిలో వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద మొత్తం రూ.1,500 జరిమానా చేతిలో పెట్టి ఈసారికి వార్నింగ్‌తో వదిలిపెట్టారు.
మొన్నీమధ్యే.. ఏప్రిల్‌లో నగరంలోని మాదవర మెట్రో స్టేషన్‌లో ఓ జంట అభ్యంతరకర చేష్టలకు దిగడం.. ఈ వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవ్వడం తెలిసే ఉంటుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పబ్లిక్ రోడ్లు కాస్త ప్రైవేట్ బెడ్‌రూంలుగా మారిపోయాయంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అయ్యింది.
ఇదీ చదవండి: మెట్రోలో వెళ్లే అమ్మాయిలను సీక్రెట్‌గా ఫొటో తీసి..
Tags : 1