Breaking News

మోదీ-అదానీ కామెంట్లు.. రాహుల్‌పై సభా ఉల్లంఘన ఫిర్యాదు

Published on Wed, 02/08/2023 - 10:36

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ‘అదానీ వ్యాఖ్యలు’.. రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్‌పై వరుసగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సభా ఉల్లంఘనకుగానూ ఆయనపై సభా ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ ఒకరు.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. 

మంగళవారం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో.. రాహుల్‌ గాంధీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆ విధంగా మాట్లాడారని. ఆధారాల్లేకుండా ప్రధానిపై నేరారోపణ చేశారని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే(జార్ఖండ్‌) పేర్కొన్నారు. అలా మాట్లాడటం సభానియమామళికి విరుద్ధమని, సభ ఔనత్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా.. ప్రధాని గౌరవాన్ని భంగపరిచేలా రాహుల్‌ వ్యవహరించారంటూ పేర్కొన్నారు నిశికాంత్‌. 

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ తన పరిశోధన నివేదికలో.. అదానీ గ్రూప్‌ స్టాక్‌ మ్యానిపులేషన్‌కు పాల్పడిందని, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడిందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం సంచలనంగా మారగా.. అదానీ గ్రూప్‌ ఆ నివేదికను తోసిపుచ్చింది. మరోవైపు మంగళవారం రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మోదీ, బిలియనీర్‌ గౌతమ్‌ అదానీలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

2014లో అదానీ 609వ ర్యాంక్‌లో ఉన్నాడు, ఏం మ్యాజిక్ జరిగిందో 2వ ర్యాంక్‌కి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్‌ అదానీల మధ్య స్నేహబంధం ఏంటసలు?. కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అనుచితంగా లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. గౌతమ్ అదానీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో కూర్చున్న ఒక ఫొటోను రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ 'యే దేఖియే రిష్టా, యే రిష్టా హై (ఈ సంబంధం చూడండి, ఇది సంబంధం)' అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య ఈ బంధం మొదలైందని రాహుల్ గాంధీ వాదించారు. ''భారతదేశ వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ప్రధానితో భుజం, భుజం కలిపి పనిచేశారు, మద్దతు ఇచ్చారు. ఇది జోక్ కాదు. ఆయన (గౌతమ్ అదానీ) ప్రధానికి విధేయుడిగా ఉన్నారు'' అని రాహుల్ అన్నారు. మోదీకి వైబ్రెంట్ గుజరాత్ ఆలోచనలో గౌతమ్ అదానీ సాయపడ్డారని, దీంతో ఆయనకు ఈయన అండగా నిలిచారన్నారు రాహుల్. దాని ఫలితంగానే గౌతమ్ అదానీ వ్యాపారం అభివృద్ధి చెందిందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన కామెంట్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్‌ హయాంలోనూ టాటా, బిర్లా, అంబానీల్లాంటి వ్యాపారులెందరికో అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇక ఎంపీ నిశికాంత్‌ దుబే మాట్లాడుతూ.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌(కాంగ్రెస్‌), పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీతోనూ అదానీ మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.   అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. లాజిక్ లేకుండా ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఆరోపణలు వస్తే వాదనలతో పాటు ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి. బీజేపీ ఎంపీలు రవిశంకర్‌తో పాటు స్మృతి ఇరానీ సైతం రాహుల్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)