ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే

Published on Wed, 01/29/2025 - 11:02

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ‍ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

‘మహా కుంభమేళా సందర్భంగా తీర్థరాజ సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారనే వార్త వినడం  హృదయ విదారకంగా ఉంది’ అని మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’ లో రాశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

 

ఇదే పోస్టులో ఆయన మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. విస్తృత ఏర్పాట్లు, విఐపిల కదలిక, నిర్వహణ కంటే స్వీయ ప్రమోషన్‌పై అధికంగా దృష్టి పెట్టడం, నిర్వహణలో లోపాలే తొక్కిసలాటకు కారణమని ఆయన పేర్కొన్నారు.

వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అటువంటి బలహీన వ్యవస్థను కలిగి ఉండటం ఖండించదగినది. ఇంకా కొన్ని  రాజ స్నానాలు మిగిలి ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను మెరుగుపరచాలని ఖర్గే సూచించారు. భక్తుల వసతి, ఆహారం, ప్రథమ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను మరింతగా విస్తరించాలని, సాధువులు కూడా ఇదేకోరుకుంటున్నారని అన్నారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందించాలని మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)