Breaking News

పార్టీ లైన్‌ దాటొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు

Published on Mon, 04/28/2025 - 16:40

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతలకు హైకమాండ్‌ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం దాడులపై పార్టీ లైన్‌ దాటి మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తాజాగా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాడులపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవి ఉన్నాయని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఏప్రిల్‌ 22వ తేదీ మధ్యాహ్నాం 2.30గం. ప్రాంతంలో సైన్యం దుస్తుల్లో వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు.. పహల్గాం బైసరన్‌లోయ పిక్నిక్‌ స్పాట్‌లో పర్యాటకుల్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక స్థానికుడితో సహా 25 మంది టూరిస్టులు కన్నుమూశారు. అయితే ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. 

ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదమే చోటు చేసుకుంది. పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత ఉదిత్‌ రాజ్‌ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్‌ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..

ఈ  పరిణామాలను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇతర నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఇద్దరు నేతలను మందలించినట్లు కూడా ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)