Breaking News

ప్రజాస్వామ్యం ఖూనీ

Published on Wed, 11/19/2025 - 04:48

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ముసుగులో ఎన్నికల కమిషన్‌(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్‌ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్‌ చేసింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్‌ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం సమావేశమైంది.

కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్‌ఐఆర్‌ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్‌ మొదటి వారంలో రాంలీలా మైదాన్‌లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.

ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్‌ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు.

ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాం
ఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్‌లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)