పెళ్లి చేసుకోమని వేధిస్తోంది

Published on Wed, 12/10/2025 - 15:48

ఛత్తీస్‌గఢ్‌లో ఒక మహిళా డీఎస్‌పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్‌ థండన్‌ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ రాయిపూర్‌కు చెందిన దీపక్‌ థండన్‌ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్‌ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్‌పూర్‌లో ఉన్న ఒక హోటల్‌ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.

ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్‌ అన్నారు.

ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)