Breaking News

ఆందోళన విరమించిన సీజేపీ

Published on Sat, 07/25/2026 - 17:37

ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌  పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో తమ మొదటి డిమాండ్‌ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్‌ పేర్కొన్నారు.

ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్‌మంతర్‌ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.

వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ.. నవభారత్‌కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్‌చుక్‌ కోరారు.

 

 

 

Videos

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)