Breaking News

మీనాక్షి నటరాజన్‌ ఎపిసోడ్‌.. సీఈసీ కీలక వ్యాఖ్యలు

Published on Fri, 07/17/2026 - 20:33

ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. నామినేషన్ పత్రంలో ప్రతీ కాలమ్‌ భర్తీ చేయాలని ఎన్నికల నిబంధన ఉందన్నారు. కొన్నిసార్లు ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులు దాన్నే ఎత్తిచూపుతారు. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‘‘కోర్టు కేసు వివరాలు ఇవ్వాలని నటరాజన్‌కు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత నా పరిధిలో ఉండదు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టును వెళ్లినా.. కోర్టు సైతం ఆర్వో నిర్ణయాన్నే సమర్థించింది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు ఓట్లు సర్‌ ప్రక్రియతో ఇక ఉండవు’’ అని సీఈసీ పేర్కొన్నారు.

‘సర్‌’పై విమర్శల నేపథ్యంలో జ్ఞానేష్‌కుమార్‌ స్పందిస్తూ.. ‘‘ప్రపంచంలోనే ఫెడరల్ ఎలక్షన్‌ జరిగే దేశం ఇండియా. ప్రపంచంలోనే అత్యంత ఆర్గనైజేషన్ కలిగిన బాడీ ఎలక్షన్ కమిషన్. దేశంలో ఓటర్ల సంఖ్య ప్రతీ ఏడాది 8 కోట్ల వరకు మారుతుంది. 95 కోట్ల భారతీయ ఓటర్లకు నేను లీడర్ కావడం నాకు గర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ప్రక్రియలో అందరూ ముఖ్యమే.

..ఎలక్షన్ కమిషన్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో 93.7 ఓటింగ్ శాతం ప్రపంచ రికార్డు సాధించాం. ఏఎస్‌ఎస్‌డీఎఫ్‌ ఓట్లను మాత్రమే ఎలక్షన్ కమిషన్ తొలగిస్తుంది. ‘సర్‌’ను ఇతర దేశాలను ఆదర్శనంగా తీసుకోబోయే రోజులు వస్తాయి. ప్రభుత్వ పథకాలకు ఓటర్ ఐడి కార్డు తప్పనిసరి అనే వార్తల్లో నిజం లేదు’’ అని సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)