Breaking News

షాకింగ్‌ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!

Published on Wed, 07/01/2026 - 12:19

వెనిజులాలో గత మే నెలలో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్న భారతీయ నావికుడి (సీఫేరర్) 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ అనుమానాస్పద మరణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ అమెరికా దేశం నుండి స్వదేశానికి తీసుకువచ్చిన రాకేష్ చౌహాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులతో సహా పలు అంతర్గత అవయవాలు మాయమయ్యాయని ఆరోపించారు. 

కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు భారతదేశంల నిర్వహించిన రీ-పోస్ట్‌మార్టం  (Re-autopsy) నివేదికలో వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్‌ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని 'ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా' (FSUI) డిమాండ్ చేసింది.  ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, వెనిజులా అధికారులు ఎలాంటి పోస్ట్‌మార్టం నివేదిక లేదా వివరాలు ఇవ్వకుండానే రాకేష్ భౌతికకాయాన్ని యూపీలోని డియోరియాలోని అతని స్వగ్రామానికి పంపించారని FSUI పేర్కొంది.

 FSUI పోస్ట్ ప్రకారం మృతదేహంలో ఒక్క అవయవం కూడా లేదు. మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), ప్లీహం (స్లీన్), క్లోమం (పాంక్రియాస్), ప్యాంక్రియాస్, కడుపు, ప్రేగులు... ఇలా అన్నీ మాయ మయ్యాయి. అలాగే థైరాయిడ్, హయాడ్ ఎముక, లారింక్స్, శ్వాసనాళం కూడా లేవు. మృతదేహంపై గతంలోనే భారీగా కుట్లు వేసి ఉన్నాయి. మెడ నుండి ప్యూబిక్ సింఫిసిస్ వరకు 22 కుట్లు, ఒక చెవి నుండి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయి. మరణానికి ముందు జరిగిన గాయాల గుర్తులేవీ లేవు. మృతదేహాన్ని దాదాపు నెల రోజుల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. శరీరంలో ఎలాంటి అవయవాలు లేకపోవడం వల్ల మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేక పోయారు.

ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సముద్రయాన కార్మికులు బలిపశువులుగా మారుతున్నారు. వెనిజులా అధికారుల నుండి పూర్తి విచారణ, జవాబుదారీతనం, వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకొని, పూర్తి శవ పరీక్ష నివేదిక, మరణానికి గల కారణాలు, కుటుంబానికి న్యాయంతో పాటు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేసింది. విదేశాల్లో భారతీయ కార్మికులను చూసే విధానం, పారదర్శకత, విదేశీ అధికారుల బాధ్యతలపై ఈ ఘటన అనేక తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోందని నావికుడి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్‌ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు

కాగా యూపీలోని డియోరియా, లగ్దా బజార్ టోలా నివాసి అయిన చౌహాన్, నవంబర్ 2025లో ఒక వాణిజ్య నౌకాదళ నౌక సిబ్బందిలో భాగంగా వెనిజులాకు వెళ్లారు. రాకేష్‌ను ఆ నౌకలో పంపిన సంస్థ ఎక్స్‌ఫినిటీ. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నౌకపై పడిన రాకేష్‌ గాయపడ్డారని చికిత్స పొందుతున్నారని తొలుత సమాచారం అందించిన కంపెనీ అధికారులు,ఆ మరుసటి రోజు ఉదయం, చౌహాన్ బతికే అవకాశాలు 95 శాతం లేవని, సాయంత్రానికి ఆయన మరణాన్ని ధృవీకరించింది. కారణాలపై వారు ఆరా తీయగా, కింద పడటం వల్ల కలిగిన తీవ్ర గాయాల కారణంగానే చనిపోయారని కంపెనీ పేర్కొంది. అలాగే వారంరోజుల్లో మృతదేహాన్ని అప్పగిస్తామన్న కంపెనీ దాదాపు ఒక నెల తర్వాత, అంటే జూన్ 4న మృతదేహాన్ని అప్పగించింది.

ఇదీ చదవండి: కేతన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ : రూ. 10 కోట్ల డిఫమేషన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)