Breaking News

పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అరెస్ట్

Published on Fri, 10/24/2025 - 17:45

ప్రముఖ బాలీవుడ్  గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్‌ పాటలతో పాపులర్‌ అయిన సంఘ్విని  లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే  అనంతరం బెయిల్‌పై విడుదలైనారు. 

తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.  ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు  అధికారి తెలిపారు. 

చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్‌ నోట్‌ కలకలం

ఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్‌పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్‌  చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin  ఇన్‌యాక్టివ్‌గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా  జంటగా నటించి , దీపావళికి విడుదలైన  థమ్మాకి సచిన్ అండ్‌ జిగర్ సంగీతం అందించారు.  గత ఏడాది  స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన   చేసిన "ఆజ్ కీ రాత్"  బాగా హిట్‌అయిన సంగతి తెలిసిందే.

చదవండి: కేరళలో పెళ్లి వైరల్‌ : ఎన్‌ఆర్‌ఐలకు పండగే!

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)