Breaking News

పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి

Published on Mon, 11/17/2025 - 11:44

బెట్టియా: బీహార్‌లోని బెట్టియా జిల్లాలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ  అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు  అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.

తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు  ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్‌లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్‌పూర్వాకు ఈ వివాహ  అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ టార్గెట్‌.. రైలు వెళ్లగానే పేలుడు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)