‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’

Published on Wed, 07/29/2026 - 20:18

పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సదాఖత్ తాను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నానని పేర్కొన్నాడు.

“జూలై 24న నీట్ లీక్‌కు వ్యతిరేకంగా ఎల్‌ఆర్‌పీ చౌక్ వద్ద నిరసన జరిగింది. ఆ కేసులో బహదూర్‌గంజ్ అడ్మినిస్ట్రేషన్‌ నా పేరు చేర్చింది. నేను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నాను” అని సదాఖత్ చెబుతూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

“నేను రష్యాలో ఉండడంతో నా పేరును అక్కడి నుంచి తొలగించాలని అడ్మినిస్ట్రేషన్‌ను కోరుతున్నాను. అలా చేస్తే వారికి రుణపడి ఉంటాను” అని అతడు కోరాడు. అతడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నప్పటికీ దాని ప్రామాణికతను స్వతంత్రంగా ఇప్పటివరకు ఏ మీడియా కూడా నిర్ధారించలేకపోయింది.

పోలీసులు ఏమన్నారు?
కిషన్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ హరి మోహన్ శుక్లా స్పందిస్తూ... వైరల్ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు, ఖండించలేదు. సదాఖత్ వీడియోపై అడిగిన ప్రశ్నకు హరి మోహన్‌ స్పందిస్తూ.. “నిరసనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్నవారు పోలీసులను సంప్రదించవచ్చు. పరిష్కారం పొందవచ్చు” అని చెప్పారు.

బిహార్ పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా గతంలో ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు. తొలగించినట్టు తెలుస్తోంది.

విద్యార్థులపై కేసులు ఉపసంహరించనున్న ప్రభుత్వం
ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం... నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన సీజేపీ ఆందోళనలు చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి.

రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 26 ఉదయం 6 గంటల కంటే ముందు జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన “అన్ని ఎఫ్‌ఐఆర్‌లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు” ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకుంది ప‍్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్టైన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)