Breaking News

అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్‌!

Published on Mon, 06/01/2026 - 07:11

ఒకటి క్రికెట్‌ కప్‌.. మరొకటి ఫుట్‌బాల్‌ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్‌. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్‌ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్‌జీ ఛాంపియన్స్‌ లీగ్‌ విజయం తర్వాత పారిస్‌లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.

యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్లో ఆర్సెనల్‌ను ఓడించి ప్యారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ (PSG) మరోసారి యూరప్‌ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే పారిస్‌ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్‌ టవర్‌ క్లబ్‌ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.

ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.

ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.

అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.

వాస్తవానికి పారిస్‌ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్‌ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్‌లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్‌ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)