Breaking News

ఆమె ఏమో దుబాయ్‌లో.. నేనేమో ఇంకా ఈ ట్రాఫిక్‌లో!

Published on Sat, 07/19/2025 - 16:33

మన దేశంలో బెంగళూరు ట్రాఫిక్‌కంటూ (Bengaluru Traffic) ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం ఆ ట్రాఫిక్‌లో నరకం అనుభవించేవాళ్లకే ఆ బాధేంటో తెలుస్తుంది. ఇటు..  సోషల్‌ మీడియాలో దీనిపై నడిచే చర్చ అంతా ఇంతా కాదు. అలా అక్కడి పరిస్థితులపై ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  

దుబాయ్‌ వెళ్తున్న తన స్నేహితురాలిని ఒకడు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగబెట్టాడట. తిరిగి తాను ఇంటికి వెళ్లే క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడట. అలా ఆమె దుబాయ్‌కి చేరుకుంటే.. అతను మాత్రం ఇంకా ఆ ట్రాఫిక్‌లోనే ఉండిపోయాడట. బంపర్‌ టు బంపర్‌ ట్రాఫిక్‌ అకౌంట్‌ ఎక్స్‌ అకౌంట్‌లో ఈ వీడియో షేర్‌ అయ్యింది.

బెంగళూరుకు చెందిన @bengalurupost1 యూజర్‌ ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇదెంత వరకు నిజం? అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇది సెటైరికల్‌ పోస్టే అని స్పష్టమవుతున్నా.. సరదాగా కాసేపు కామెంట్లతో బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలపై జోకులు పేలుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటు గురుగ్రామ్‌కు చెందిన ఓ ట్రాఫిక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వర్షం పడడంతో నీరు నిలిచిపోయి.. నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్న దృశ్యాలు అవి. అయితే దానికి కూడా బెంగళూరుకు ముడిపెట్టి జోకులు పేలుస్తున్నారు. ఇది బెంగళూరు ట్రాఫిక్‌ కంటే ఎంతో నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 ఇదీ చదవండి: బెంగళూరు ట్రాఫిక్‌ సమస్య చెక్‌ ఇలా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)