Breaking News

యువతి మెడపై కత్తి, బిజీ రోడ్‌లో దుండగుడు హల్‌చల్‌, వీడియో వైరల్‌

Published on Tue, 11/03/2026 - 19:41

 సాక్షి,బెంగళూరు: బెంగళూరులోని రద్దీగా ఉండే ఇందిరానగర్ ప్రాంతంలో హెల్మెట్ ధరించిన ఒక దుండగుడు  హల్‌  చల్‌ చేశాడు. స్థానిక  దుకాణంలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువతిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని గొలుసు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్‌గా మారింది.

దొమ్మలూరుకు చెందిన జయశ్రీ (23)  100 ఫిట్ రోడ్డులోని 'ప్రీమియం షూ అండ్ బ్యాగ్ రిపేర్' షాప్‌లో పని చేస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 11:45 గంటల ప్రాంతంలో నిందితుడు ప్రభురాజ్ (40). హెల్మెట్, గ్లౌజులు ధరించి షాప్‌లోకి ప్రవేశించాడు. "నన్ను చంపడానికి ఎవరో వస్తున్నారు" అని చెబుతూ కౌంటర్‌దాటి  వచ్చాడు. అకస్మాత్తుగా యువతి నోరు మూసివేసి గొంతుపై కత్తి  పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు.అంతేకాదు  చేతులకు ఫెవిక్విక్ (Fevikwik) గ్లూ పూసి అతికించాడు.  ఆమె అరిచి కేకలు వేయకుండా నోట్లో గుడ్డ  కుక్కాడు.  అలా మెడలోని రూ. 4.5 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. ఆమె విడిపించుకుని కేకలు వేయగా, ఆమె జుట్టు పట్టుకుని లోపలికి ఈడ్చుకెళ్లి, బయట గుమిగూడిన ప్రజలను దగ్గరకు రావద్దని కత్తితో బెదిరించాడు. షాప్ యజమాని, స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైకి కూడా కత్తి విసిరాడు. అనంతరం అక్కడినుంచి ఉడాయించాలని చేశాడు.కానీ స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి అతడిని వెంటాడి పట్టుకుని ఇందిరానగర్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే

 

ఈ ఘటనపై ఈస్ట్ డివిజన్ డీసీపీ విక్రమ్ అమతే మాట్లాడుతూ స్థానికుల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.  నిందితుడు మానసిక సమస్యలత బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే బాధితురాలు సురక్షితంగా ఉందని,  పోలీసులు చెప్పారు. నిందితుడు పూర్వాపరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి : ఏసీపీ మనస్వి వసిష్ఠ్‌పై సస్పెన్షన్ వేటు

ఇదీ చదవండి: పోక్సో కేసులో బెయిల్‌, బాలికపై కత్తితో దాడి, యువకుడి సాహసం
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)