Breaking News

అయ్యో.. యామిని!

Published on Fri, 10/17/2025 - 07:39

కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష  కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్‌ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. 

రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.  విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు.  శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

ప్రియా యామిని ఆ నిందితుడి బైక్‌ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్‌తో తల్లీబిడ్డా సేఫ్‌!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)