Breaking News

అయోధ్యరాముడి విరాళాల గోల్‌మాల్‌ : స్పందించిన ఆర్‌ఎస్‌ఎస్‌

Published on Fri, 07/03/2026 - 16:38

అయోధ్య రామాలయంలో విరాళాల గోల్‌మాల్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన రేపింది. దీనిపై ఉత్తరప్రదేశ్  ఏర్పాటు చేసిన సిట్‌ ఇప్పటికే అనేక షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తాజాగా విరాళాల మాయంపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తొలిసారి స్పందించింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అలాగే ఈ ఘటన ద్వారా హిందూమతాన్ని అప్రతిష్టపాలు చేయడానికి దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.

అయోధ్యలోని రామమందిరంలో హుండీ సొమ్ము దొంగతనానికి గురైన ఘటన తమను ఎంతో కలచి వేసిందని, తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలిపింది. ఈ దురదృష్టకర సంఘటన హిందూ సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీరాముని భక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని, వారి సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని ఆర్‌ఎస్‌ఎస్ గుర్తు చేసింది. ఈ విచారణలో నిందితులుగా తేలిన వారెవరినైనా సరే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఆలయ నిర్వహణ మారాలి
ఆర్‌ఎస్‌ఎస్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ ఘటనను ఒక ఎక్సెప్షనల్ విషయంగా పరిగణించాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరింది. ఆలయ పరిపాలన, నిర్వహణ లోపాలన్నింటినీ సరిదిద్దడానికి తక్షణమే సమర్థవంత మైన చర్యలు చేపట్టాలని కోట్లాది భక్తులకు అయోధ్య ఆలయంపై ఉన్న నమ్మకం, భక్తి ఏమాత్రం సడలకుండా చూడాల్సిన బాధ్యత ట్రస్ట్‌పై ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం, అనిశ్చితికి వెంటనే ముగింపు పలకాలని కోరింది.

ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్‌.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్‌!

హిందూ ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేసే  కుట్ర: దత్తాత్రేయ హోసబాలే
ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రామాలయంలో విరాళాల దొంగతనం తీవ్రంగా బాధించిందన్నారు. అంతే కాకుండా, ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని "హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు" హిందూ ధర్మానికి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని హోసబాలే ఆరోపించారు. అందువల్ల సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్‌ మదర్‌ సునీత సక్సెస్‌ స్టోరీ

కాగా ఆలయంలోని  కౌంటింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని, అక్కడి ఉద్యోగులే   డబ్బులను చాకచక్యంగా తస్కరించి, ఆ తరువాత  ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లలో దాచిపెట్టి, సీసీటీవీకి చిక్కకుండా  గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకెళ్లేవారని  సిట్‌ విచారణలోనిందితులు తెలిపారు. అనేక సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. జూలై 15లోగా ప్రభుత్వం ముందుకు పూర్తి నివేదిక సమర్పించనుంది.

ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్‌లోనే : నటి ఆవేదన

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)