Breaking News

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్‌ ఆగ్రహం

Published on Mon, 04/28/2025 - 11:44

ఢిల్లీ: మీరు మా కంటే (భారత్‌) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. 

ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్‌ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.

మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు
అభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు.  మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్‌ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్‌ఐఎస్‌  వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.

 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్‌ డిమాండ్‌
అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్‌ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు.  పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Pahalgam Incident: పాకిస్థాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్

షేమ్‌
పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్‌. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎత్తి చూపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)