Breaking News

అక్టోబర్‌ 31.. రాష్ట్రీయ ఏక్తా దివస్‌ 

Published on Fri, 10/31/2025 - 06:32

పట్నా: ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్‌ (జాతీయ సమైక్యతా దినోత్సవం) నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఏటా రిపబ్లిక్‌ డే రోజు ఢిల్లీలో పరేడ్‌ నిర్వహించినట్టుగానే రాష్ట్రీయ ఏక్తా దివస్‌ రోజున గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో భారీ పరేడ్‌ నిర్వహిస్తామని తెలిపారు. సర్దార్‌ వల్లబ్‌భాయి పటేల్‌ 150 జయంతి (అక్టోబర్‌ 31)ని పురస్కరించుకొని నవంబర్‌ 1 నుంచి భారత్‌ పర్వ్‌–2025 ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరేడ్‌ జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుంది. సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభిస్తున్న ఈ పరేడ్‌ ఏటా అక్టోబర్‌ 31న ఘనంగా జరుగుతుంది. ఈ పరేడ్‌ సర్దార్‌ పటేల్‌ సిద్ధాంతాలు, ఆయన సేవలను నేటి తరానికి తెలియజేసేలా ఉంటుంది. శుక్రవారం నిర్వహించే పరేడ్‌లో మహి ళా కంటింజెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు, పారా మిలిటరీ పరేడ్‌ల వంటివి ఉంటాయి’అని షా వెల్లడించారు.  

15 రోజులు భారత్‌ పర్వ్‌ 
సర్దార్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా భారత్‌ పర్వ్‌–2025 ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు అమిత్‌ షా ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్‌ 1న ప్రారంభమై ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి రోజైన నవంబర్‌ 15 వరకు గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ (పటేల్‌ భారీ విగ్రహం) వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్కడే పటేల్‌ 150వ జయంతి వేడుకలను కూడా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని వెల్లడించారు. 
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)