విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు

Published on Sat, 02/28/2026 - 19:25

టీవీకే పార్టీ అధ్యక్షుడు, అగ్రహీరో దళపతి విజయ్‌కు మరో బ్యాడ్‌ న్యూస్‌ తప్పదా. భార్య సంగీతసోర్నలింగంతో విడాకుల వార్తల మధ్య, మరో ఎదురు దెబ్బ తగలనుందా? తమిళనాట సీఎం కావాలని కలలు కంటున్న విజయ్‌ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్కుడి సంచలన అంచనాలు వైరల్‌గా మారాయి. ఏమిటా అంచనాలు? ఈ కథనంలో తెలుసుకుందాం. 

తమిళనాడు ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సీజన్ కు సిద్ధమవుతున్న వేళ, అందులోనూ   విజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ ఉన్న వివాదాల తుఫాను  విజయ్‌ ఇమేజ్‌కు కళంకంగా మారింది.

ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

27 నంబరు గండం
నటన నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది  మొదలు  వరుస కష్టాలు  తప్పడం లేదు.   మరీ ఆయన జీవితంలో27 నంబరు కలిసి రావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా

తమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ్ పార్టీ (TVK) సభ సందర్బంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది.  ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్  27న జరిగింది.

భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసిన ఫిబ్రవరి 27న వెలుగులోకి వచ్చింది. దీంతో 27 ఏళ్ల వైవాహిక బందం సంక్షోభంలో పడింది.

ఇటీవలి చిత్రం జన నాయగన్ ఆలస్యం , కోర్టు పోరాటం తర్వాత, విజయ్ భార్య  విడాకుల కోసం దాఖలు చేయడంతో,  విజయ్  కష్టాలు అంతులేనివిగా కనిపిస్తున్నాయి. 

ఇది చాలదన్నట్టు దళపతి విజయ్ భవిష్యత్తుపై  జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ కు మరో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశారు. 

ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం


 

జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని విజయ్ రాజకీయ గమనం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. “2030 తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధిస్తాడు. కానీ ఈసారి మాత్రం తమిళ రాజకీయాల్లో ఆయన  ఉనికి   చాటుకుంటాడు అంతే….!! ఆయన ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈసారి కాదు….!! (sic).”

మరొక పోస్ట్‌లో,  “దళపతి విజయ్ ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరు….!!  అని పేర్కొన్నాడు. ఎం. జి.రామచంద్రన్,  జయలలిత మాదిరిగానే చరిత్ర పునరావృతం కావచ్చని వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)