Breaking News

ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

Published on Tue, 06/16/2026 - 16:47

బిహార్‌లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో  అనుకోని ట్విస్ట్‌. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలేమైంది?

కట్వా రసూల్‌పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన  ఘటన  వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి.

ఇదీ చదవండి:  అఫ్గాన్‌లో సోలో ట్రిప్‌, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్‌ నటుడు కూడా!

చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్‌లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.

ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)