Breaking News

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్‌

Published on Sun, 06/22/2025 - 11:34

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై  ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు  హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను  నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్‌ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.  

పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.  ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.



ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్‌.. ఇరాన్‌పై దాడుల ఫలితం

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు