Breaking News

‘రామాయణ’పై యశ్‌ కొడుకు రివ్యూ

Published on Sun, 11/01/2026 - 17:59

నటుడు యశ్‌ కెరీర్‌లో తొలిసారి పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడిగా కనిపించబోతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు.  ఈ నెల 5న విడుదల కానుంది.

 ఈ సినిమా ఇటీవల లాస్‌ ఏంజెలెస్‌లో ప్రీమియర్‌ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి యశ్‌ తన భార్య రాధికా పండిట్‌, పిల్లలు యథర్వ్‌, ఆర్యతో కలిసి హాజరయ్యారు. థియేటర్‌లో తన తండ్రి నటించిన తొలి సినిమాను చూసిన యథర్వ్‌.. బయటకు వచ్చాక కన్నీళ్లు పెట్టుకున్నాడట. అంతేకాదు.. తండ్రిపై ఓ విషయంలో ఫిర్యాదు కూడా చేశాడట. ఈ విషయాన్ని నటి సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పక్షిని చంపడం నచ్చలేదట!
సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత యశ్‌ కుమారుడు యథర్వ్‌ ఏడ్చాడని సాయిపల్లవి తెలిపారు. సినిమాలో రావణుడిగా నటించిన తన తండ్రి ఓ పక్షిని చంపే సన్నివేశం చూసి అతడు బాధపడ్డాడట. ‘నువ్వు పక్షిని చంపడం నాకు నచ్చలేదు. సినిమాలో అయినా అలా చేయకూడదు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు’ అని యథర్వ్‌ తన తండ్రితో అన్నాడట. తన తండ్రి నటిస్తున్నాడని తెలిసినా.. సినిమాలో పక్షిని చంపడం సరైనది కాదని అతడు భావించాడని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

కొడుకుకు యశ్‌ ఏం చెప్పారంటే?
గతంలోనూ యశ్‌ తన కుమారుడి స్పందన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రామాయణ కథ తెలిసిన తర్వాత యథర్వ్‌ తనను చెడ్డవాడిగా భావించాడని తెలిపారు. ‘నువ్వే చెడ్డవాడివి.. అలా ఎలా చేయగలవు?’ అని ప్రశ్నించాడట. దీంతో యశ్‌ తన కుమారుడికి రామాయణంలోని నీతి గురించి వివరించారట. ఈ కథలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సింది శ్రీరాముడినేనని చెప్పారట. రావణుడు ఎంత గొప్పవాడిగా, శక్తిమంతుడిగా కనిపించినా.. జీవితంలో నిజమైన విజయం ధర్మబద్ధంగా నడుచుకోవడంలోనే ఉంటుందని వివరించినట్లు యశ్‌ వెల్లడించారు. 

(ఇదీ చదవండి: అనసూయ డైరెక్టర్‌తో కంగనా.. రానా ప్లాన్ మామూలుగా లేదుగా!)

 

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)