Breaking News

రాజ్‌తో సమంత రెండో పెళ్లి.. ఇంత ఏజ్ గ్యాప్‌ ఏంటి సామీ..!

Published on Mon, 12/01/2025 - 18:27

గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్‌ వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్‌ ఏజ్‌ గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్‌ ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్‌ మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.

సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఈ లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్‌కు సంబంధించిన అఫీషియల్‌ పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4వ తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ లెక్కన సామ్- రాజ్‌కు మధ్య ఏజ్ గ్యాప్‌ దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్‌ బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)