Breaking News

మరో ఓటీటీలోకి క్రేజీ హారర్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్

Published on Thu, 12/25/2025 - 13:06

హారర్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. చూస్తున్నప్పుడు భయపెడతాయి. ఈ ఏడాది అలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని భయపెట్టిన ఓ సినిమా ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?)

ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన హాలీవుడ్ మూవీ 'వెపన్స్'. రూ.335 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.2400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. విడుదల తర్వాత కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎక్కువమంది చూడలేకపోయారు. ఇప్పుడు కొత్తగా హాట్‌స్టార్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 8 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగులోనూ  అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

'వెపన్స్' విషయానికొస్తే.. మేబ్రూక్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి 2:17 గంటలకు 17 మంది చిన్నారులు వాళ్ల ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతారు. ఎంత వెతికినా కనిపించరు. వీళ్లంతా ఒకే స్కూల్‌ ఒకే క్లాస్‌లో చదువుతుంటారు. ఇదే క్లాస్‌కి చెందిన ఓ పిల్లాడు మాత్రం బాగానే ఉంటాడు. దీంతో ఊరందరి అనుమానం క్లాస్ టీచర్ జస్టిన్(జూలియా గార్నర్)పై పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇ‍ప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)