Breaking News

ఐపీఎల్ ఫైనల్‌.. వార్‌-2 టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్‌!

Published on Tue, 06/03/2025 - 16:32

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్, టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Jr NTR) నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్‌ విలన్‌ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్‌ప్రైజ్‌కు సిద్ధమయ్యారు.

ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్‌లో వార్‌-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో  హృతిక్‌, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్‌ బ్రేక్‌ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. 

మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్, బెంగళూరు టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి.
 

 

Videos

మరోసారి పోకిరి కాంబో.. వారణాసితో పాన్ వరల్డ్ షేక్

తిరుపతి అలిపిరి వద్ద తోపులాట

కోడిని చంపినట్లు భర్తలను చంపుతున్న భార్యలు

తోలు తీస్తా, తొక్క తీస్తా.. చివరికి మీ వాడికే తోలు తీశారు

వాటికన్ సిటీ, బెత్లహంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

పిక్నిక్ వెళ్తుండగా విషాదం.. స్కూల్ బస్సు బోల్తా..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

తొక్క.. తోలు.. అన్నావ్.. ఆ ఆవేశం ఏమైంది..

ఒక్కసారిగా కారులో మంటలు..8 మంది..

మళ్లీ అదే మాట.. శివాజీ నోటి దూల

Photos

+5

టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కర్నూల్ ఇన్సిడెంట్ కర్ణాటకలో రిపీట్! (చిత్రాలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా టాలీవుడ్‌ ప్రో లీగ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో క్రిస్మస్‌ పండగ సందడి (ఫొటోలు)

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)